BREAKING: తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం

-

BREAKING: మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు.

Talasani Srinivas Yadav brothers Talasani Shankar Yadav passed away

గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్…ఇవాళ మరణించారు. సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గతంలో బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా కూడా తలసాని శంకర్ యాదవ్ పని చేశారు. దీంతో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version