తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగరెడ్డి ఎమ్మెల్యే జగ్గరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2023 లో జరగబోయే సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు మీడియా తో మాట్లాడబోనని ప్రకటించారు. ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగుర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా జగ్గరెడ్డి ఈ సమావేశం లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై పోరాడుతానని తెలిపారు. అలాగే పార్టీ కి నష్టం చేకురే విధంగా ఉన్న తాను స్పంధించ ను అని అన్నారు. అలాగే తాను పీసీసీ ప్రెసిడెంట్, సీఎల్పీ నేతను, ఠాగుర్ ను గౌరవిస్తానని తెలిపారు. వీరు కాంగ్రెస్ అధి నేత్రి సోనియమ్మ దూతలు అని అన్నారు. అలాగే సమావేశం లో కూడా తన మనస్సు లో ఉన్న ఆవేదన ను మాత్రమే చేప్పానని అన్నారు. తన ప్రకటన లు కొంత మందిని కన్ఫ్యూజ్ చేశాయని తెలిపారు. ఇక నుంచి మీడియా కు దూరంగా ఉంటానని కూడా ప్రకటించారు.