ఆ ట‌పాసులు అమ్మితే క‌ఠిన చ‌ర్చ‌లే!

-

దీపావ‌ళి రావ‌డం తో ట‌పాసులు పై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటుంది. రాష్ట్రం లో ప‌లు ర‌కాల ట‌పాసుల పై రాష్ట్ర ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించింది. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ జారీ చేశారు. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం రాష్ట్రంలో బేరియం ల‌వ‌ణాలతో కూడిన ట‌పాసుల‌ను పూర్తిగా నిషేధించింది.

ఈ బేరియం ల‌వ‌ణాలు ఉన్న ట‌పాసులు అమ్మితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అలాగే దీపావ‌ళి పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం అయిన సుప్రీం కోర్టు ఆదేశాల‌ను తప్ప‌ని స‌రిగా పాటించాల‌ని తెలిపింది. ఈ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారి పై కూడా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఉత్త‌ర్వుల‌లో తెలిపారు. అయితే ఇటీవ‌ల‌ బేరియం ల‌వ‌ణంతో త‌యారు చేసిన ట‌పాసుల వాడ కూడ‌ద‌ద‌ని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. అయితే దీపావ‌ళి పై ప్ర‌భుత్వాలు ఆంక్ష‌లు విధించ‌డం ప‌ట్ల ప‌లు ర‌కాల హిందు సంస్థ‌లు తీవ్రం గా వ్య‌తిరేకిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version