వరద ప్రభావం వరంగల్ లో దారుణంగా ఉందని పేర్కొన్నారు గవర్నర్ తమిళి సై. ఇవాళ హనుమకొండ జిల్లాలో వర్షాలతో ముంపుకు గురైన వరద బాధితులను పరామర్శించి వారికి నిత్యవసర సరుకులు కావాల్సిన మందులు పంపిణీ చేసి వారి నీ ఉద్దేశించి మాట్లాడారు. హనుమకొండ నగర కేంద్రమైన జవహర్ నగర్ ప్రాంతంలో అధిక ప్రాంతం ముంపు గురై ,ఇక్కడి బ్రిడ్జి బాగా దెబ్బతిన్నట్టు ఆమె తెలిపారు.
బ్రిడ్జి పనులు వెంటనే మరమ్మతు చేపట్టి నీరు సాఫీగా వెళ్లిపోవడానికి అధికారులు చొరవ తీసుకొని సహకరించాలని కోరారు. గతంలో పలుమార్లు స్థానికులు ప్రభుత్వ అధికారులకు విన్నపించినప్పటికీ సమస్య ఇదేవిధంగా ఉండడం ఆమె తప్పు పట్టారు. సమస్య పరిష్కారాలు దీర్ఘకాలంగా ఉండాలని ,అవి శాశ్వత పరిష్కారం కావాలని ఆమె కోరారు. హనుమకొండల జిల్లా కేంద్రం లోని వరదల విషయం తాను సోషల్ మీడియా ద్వారా వీడియోలను చూసి వెంటనే రెడ్ క్రాస్ సిబ్బందికి సమాచార చేరవేసి బాధితులను వెంటనే ఆదుకోవాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు.