Telangana: పెళ్లి కావడం లేదని 24 ఏండ్ల యువకుడు ఆత్మహత్య

-

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కావడం లేదని 24 సంవత్సరాల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో చోటుచేసుకుంది. ఈ మధ్యకాలంలో… యువకులకు పెండ్లిలు కావడం లేదు. ఉద్యోగాలు అలాగే బిజినెస్ చేసిన కూడా… యువకులకు అమ్మాయిలను ఇచ్చేందుకు… బాగా ఆలోచిస్తున్నారు. అయితే ఉద్యోగం లాంటిది ఏదీ చేయకపోతే అసలు… పెళ్లి కాని పరిస్థితి తెలంగాణలో చోటుచేసుకుంది.

ఈ తరుణంలోనే పెళ్లి కావడం లేదని చాలామంది యువకులు డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. 30 సంవత్సరాలు దాటినా కూడా పెళ్లి కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పెళ్లి కావడం లేదని నిర్మల్ జిల్లాకు చెందిన ఇమ్రాన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బైంసా పట్టణంలోని కుంట ఏరియా కు చెందిన ఇమ్రాన్ 24 సంవత్సరాలు. అయితే.. ఇమ్రాన్ కు ఎన్నో సంబంధాలు చూసినా పెళ్లి కాలేదు. ఈతరణంలోనే స్థానికంగా ఉన్న గడ్డన్న వాగు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఇమ్రాన్. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version