డిసెంబర్ 09 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

-

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 09 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 07 కి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి అయింది. ప్రభుత్వం చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి.. రాబోయే కాలంలో చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధం అవుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు, ఆరు గ్యారెంటీలపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు కూడా సిద్దం కానున్నాయి. 

Assembly

అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీ ఎన్నికల పై చర్చించే అవకాశం ఉంది. కొత్త ఆర్ఓఆర్ చట్టం, కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్, పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు, పలు కొత్త చట్టాలు అసెంబ్లీలో చర్చించనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరూ కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా పోటీ చేసేందుకు అర్హులుగా చట్టం తీసుకురానున్నారు. ఇలా పలు చట్టాలను ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురానుంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రి వర్గ విస్తరణ కూడా చేయనున్నట్టు సమాచారం. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తరువాత మంత్రి వర్గ విస్తరణ జరుగనున్నట్టు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Exit mobile version