హైడ్రా విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ సిబ్బందిని కూడా నియామకం చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హైడ్రాకు ప్రత్యేకంగా 15 సీఐ స్థాయి అధికారులను నియామకం చేసింది.
అలాగే 8 మంది ఎస్సై స్థాయి ప్రత్యేక పోలీసులను కేటాయిస్తూ డిజిపి కార్యాలయంకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో.. ఇకపై హైడ్రాకు ప్రత్యేక పోలీస్ సిబ్బంది ఉండబోతుందన్నమాట. ఎవరైనా హైడ్రాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే.. ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగి చర్యలు తీసుకోనుంది. కాగా హైదరాబాద్ మహానగరంలో కబ్జాలు చేసిన ఇండ్లను ధ్వంసం చేసేందుకు హైడ్రాను తీసుకువచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే దీనివల్ల.. పేద ప్రజలకే తీవ్ర నష్టం జరుగుతోందని ఒక వాదన ఉంది.