పొగడ్తలు తప్ప.. నయా పైసా ఇయ్యలే : కేసీఆర్

-

నీతి ఆయోగ్ సమావేశంలో మాట్లాడటం అంటే గోడతో మాట్లాడినట్లేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దిల్లీకి పోయి రావడానికి ఖర్చులు తప్పితే రాష్ట్రానికి వచ్చేదేం ఉండదని మండిపడ్డారు. తెలంగాణలోని అన్ని శాఖలను నీతి ఆయోగ్ ప్రశంసించిందని గుర్తుచేశారు. కానీ ఒక్క పనికి కూడా రూపాయి నిధులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం 6వేల కోట్ల గ్రాంట్ ఇవ్వమంటే ఆరు పైసలు కూడా ఇవ్వలేదని అన్నారు. కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయలు వస్తున్నట్లు బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

“మోదీ వాగ్దానాలు, బీజేపీ వాగ్దానాలు, నీతిఆయోగ్ సృష్టి ఒక జోక్ అయిపోయింది. దేశంలో ఇప్పటి వరకు లేనట్లు నానాటికీ దిగజారిపోతున్న పరిస్థితి. విద్వేషం, అసహనం పెరిగిపోయి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో డిమాండ్లతో ధర్నాలు చేసేవారు. వీటితో కొన్నిసార్లు ఫలితాలు కూడా ఉండేవి. దేశ చరిత్రలో లేని విధంగా దేశ రైతాంగం మొత్తం రాజధానిలో 13 నెలలపాటు ధర్నా చేశారు. వారిలో 700-800 మంది చనిపోయారు. ఆ తర్వాత ప్రధాన మంత్రే క్షమాపణలు చెప్పి చట్టాలు వెనక్కు తీసుకున్నారు.” అని కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version