తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అదే విధంగా రంజాన్ సందర్భంగా తన నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు.
అలాగే నియోజకవర్గంలోని పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని సమాచారం. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది.