తెలంగాణ సీఎం ఎవరనే ఉత్కంఠకు ఇవాళ తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే….మధ్యాహ్నం ఖర్గేతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సీఎం క్యాండిడేట్ ని ఎంపిక చేస్తారు. అనంతరం డీకే ఠాక్రే సీల్డ్ కవర్ తో సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకుంటారు. అందులో ఎవరి పేరు ఉంటుందో వారే తెలంగాణ సీఎం కానున్నారు.
కాగా, రేవంత్ రెడ్డి సీఎం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం అందుతోంది. శ్రీధర్ బాబు కు స్పీకర్ ఇస్తాను అనడంతో… నేను ఖాళీగా అయినా ఉంటాను కానీ నాకు అవసరం లేదు అంటూ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు..ఆగ్రహం వ్యక్తం చేశారట. ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే నాకు ఒక్కడికి మాత్రమే ఇవ్వాలి…వేరే ఎవరికి ఇచ్చిన ఒప్పుకొనే ప్రసక్తి లేదు అంటూ భట్టి విక్రమార్కా ఆగ్రహం వ్యక్తం చేశారట. సీతక్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారట రేవంత్ రెడ్డి. సీతక్క కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేదే లేదంటే తేల్చి చెప్పారట సీనియర్ నేతలు.