తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కాసేపటి క్రితమే ముగిసాయి. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఏ పార్టీకి కూడా అధికారం వచ్చేలా కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో హంగు వాతావరణం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా… గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పక్కాగా విజయం సాధిస్తారని… కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కాకుండా బిజెపి పార్టీ గెలుస్తుందని సర్వేలు తేల్చాయి.
తెలంగాణపై న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్: కాంగ్రెస్ 56, బీఆర్ఎస్ 48, బీజేపీ 10, ఎంఐఎం 5
మధ్యప్రదేశ్‌పై న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్: కాంగ్రెస్ 108, బీజేపీ 119, ఇతరులు 3
రాజస్థాన్‌పై న్యూస్ 18 ఎగ్జిట్‌పోల్స్: కాంగ్రెస్ 74, బీజేపీ 111, ఇతరులు14
ఛత్తీస్‌గఢ్‌పై న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్: కాంగ్రెస్ 47, బీజేపీ 40,ఇతరులు 3