గద్దర్ అవార్డుల కోసం ప్రత్యేక కమిటీ.. సభ్యులెవరంటే?

-

తెలుగు సినీ పరిశ్రమకు గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ దిశగా కార్యాచరణ షురూ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన ప్రతిపాదనలు పరిశీలించింది. ఈ క్రమంలో గద్దర్ అవార్డుల విధి విధానాలు, నియమ నిబంధనలు, లోగోను రూపొందించేందుకు సినీ ప్రముఖులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది.

గద్దర్ అవార్డుల కమిటీకి ప్రముఖ దర్శకులు నర్సింగరావు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ప్రొడ్యూసర్ దిల్‌ రాజు వైస్‌ ఛైర్మన్‌గా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక కమిటీ సలహాదారులుగా దర్శకేంద్రుడు రాఘవేందర్‌రావు, అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్, నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి, గేయ రచయిత వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీశ్‌శంకర్, బలగం వేణుతోపాటు ఎఫ్డీసీ ఎండీ మెంబర్ కన్వనర్‌గా కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కమిటీతో చర్చించి తదుపరి కార్యాచరణ మొదలు పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version