లుసానె డైమండ్ లీగ్‌.. మరోసారి నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శన

-

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్ నీరజ్‌ చోప్రా మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండో స్థానంలో నిలిచినా అత్యుత్తమ పర్ఫామెన్స్ చేశాడు. తాజాగా జరిగిన లుసానె డైమండ్‌ లీగ్‌లో పాల్గొన్న నీరజ్.. 89.49 మీటర్లు ఈటెను విసిరి రెండో స్థానంలో నిలిచాడు.  ఈ సారి కూడా 90 మీటర్ల కల నెరవేరలేదు. మరోవైపు 90.61 మీటర్లు విసిరి గ్రెనెడా అథ్లెట్ అండర్సన్‌ పీటర్స్‌ అగ్ర స్థానాన్ని దక్కించుకోగా.. 87.08 మీటర్లతో జర్మన్‌ అథ్లెట్ వెబర్‌ జులియన్‌ మూడో స్థానంలో నిలిచాడు.

మొదటి రౌండ్‌లో 82.10 మీటర్లు ఈటెను విసిరి నీరజ్‌  నాలుగో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత వరుసగా 83.21 మీటర్లు, 83.13 మీటర్లు, 82.34 మీటర్లు, 85.58 మీటర్లు విసిరాడు. ఇక ఫైనల్‌ రౌండ్‌లో గ్రెనెడా అథ్లెట్ అండర్సన్‌ పీటర్స్‌ జావెలిన్‌ను 90.61 మీటర్లు విసరగా, నీరజ్‌ చోప్రా తన శక్తినంతా ఉపయోగించి 89.49 మీటర్లు ఈటెను విసిరి రెండో స్థానం దక్కించుకున్నాడు. సెకండ్ ప్లేస్లో నిలిచినా.. నీరజ్‌ కెరీర్‌లో ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version