తెలంగాణ బడ్జెట్​పై నేడు వివిధ శాఖలతో భట్టి సమీక్ష

-

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2024-25 మొదటి నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఓటాన్ అకౌంట్ గడువు జులై నెలాఖరు వరకు ఉంది. ఆ లోగా.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఉభయసభల ఆమోదం పొందాల్సి ఉంది. ఇందుకోసం ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి బడ్జెట్ కోసం ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించనుంది. బడ్జెట్ కసరత్తుకు ప్రారంభంగా ఆదాయ ఆర్జిత శాఖలతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ సమావేశం కానున్నారు. ఎక్సైజ్, వాణిజ్య  పన్నులు, రవాణా, పరిశ్రమలు, గనులు తదితర శాఖల మంత్రులు, అధికారులతో ఆయన భేటీ అవుతారు.

ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌లో పొందుపరిచిన ఆదాయాలు, ఇప్పటివరకు వచ్చిన ఆదాయం, తదితరాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఆర్థిక వనరుల సమీకరణ ఆదాయాన్ని పెంచుకునే అంశంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఉజ్జాయింపుగా నిధులను కేటాయించారు. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌లో గ్యారంటీలకు నిర్దిష్ట మొత్తాన్ని కేటాయించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version