ఏ క్షణమైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ ?

-

ఏ క్షణమైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దళిత బంధు రెండో విడత డబ్బులు విడుదల చేయాలంటూ హుజురాబాద్ హైవేపై ధర్నా చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈ తరుణంలోనే… రాస్తారోకోకు అనుమతి లేకుండా ధర్నా చేపట్టారని కౌశిక్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Padi Koushik Reddy, BRS,

అడ్డుకున్న పోలీసులను దుర్భాషలాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. దీంతో ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని నేడో, రేపో అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉండగా.. నేడు మానుకోటలో లగచర్ల లడాయి చేయనుంది బీఆర్‌ఎస్‌ పార్టీ. కొడంగల్‌ నియోజకవర్గంలోని లగచర్లలో గిరిజన రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో నేడు జరిగే బీఆర్‌ఎస్‌ మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బయలుదేరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version