Breaking : తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీ

-

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న గురుకులాల్లో పోస్టుల భర్తీకి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లు జారీ చేసింది.

రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 868 అధ్యాపకులు, ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. జూనియర్‌ కాలేజీల్లో 2008 లెక్చరర్లు, పాఠశాలల్లో 1276 పీజీటీ, 434 లైబ్రేరియన్‌, 275 ఫిజికల్‌ డైరెక్టర్‌, 134 ఆర్ట్స్‌, 92 క్రాఫ్ట్‌, 124 మ్యూజిక్‌, 4020 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ నెల 12 నుంచి వన్‌ టైం రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు.

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే నిర్వహించిన.. మరికొన్ని రోజుల్లో నిర్వహించనున్న పరీక్షలకు సంబంధించి టీఎస్పీఎస్సీ నుంచి క్వశ్చన్ పేపర్లు లీకైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు పరీక్షలు వాయిదా వేస్తూ.. మరికొన్ని పరీక్షలను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల మిశ్రమ అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కనీసం రానున్న రోజుల్లో నిర్వహించే పరీక్షలైన పారదర్శకంగా నిర్వహిస్తారా.. లేదా అనే విషయంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version