నేడు హైకోర్టులో గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్‌పై విచారణ

-

గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దును సవాలు చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఈరోజు మరోసారి విచారణ చేపట్టనుంది. మంగళవారం రోజున విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్​ యోమెట్రిక్ అమలు వల్ల ఇబ్బందేమిటో తెలపాలని ఆదేశించింది. అదే విధంగా గతంలో బయోమెట్రిక్ అమలు చేసిన పరీక్షల వివరాలు తెలపాలని కమిషన్​కు ఆదేశాలు జారీ చేసింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుబయోమెట్రిక్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది.

ఇచ్చిన నోటిఫికేషన్‌ కమిషన్ అమలు చేయకపోతే ఎలా అని నిలదీసింది. ఒకసారి పరీక్ష రద్దయ్యాక మరింత జాగ్రత్తగా ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది. నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కమిషన్​కు ఉందని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. అభ్యర్థుల భవిష్యత్తు, టీఎస్పీఎస్సీ ప్రతిష్ఠ ప్రశ్నార్థకంగా మారాయని వ్యాఖ్యానించింది.

అనంతరం విచారణను మధ్యాహ్నానికి వాయిదా హైకోర్టు బయోమెట్రిక్ ఎందుకు పాటించలేదని మరోసారి అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించగా.. సాంకేతిక కారణాల వల్లే బయోమెట్రిక్ పాటించలేదన్న ఏజీ చెప్పారు. దాని వల్ల అభ్యర్థులకు నష్టమేమీ లేదని వాదించారు. ఇదొక్కటే కారణంగా చూపి మొత్తం పరీక్షను రద్దు చేయడం సరైంది కాదన్నారు. దీనివల్ల రెండు లక్షల మంది విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. పరీక్షపై పూర్తి వివరాలు సమర్పించాలని అడ్వకేట్ జనరల్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version