మురుగునీటితో కూరగాయల సాగును అడ్డుకోండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

-

మురుగు నీటితో కూరగాయల సాగుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కాలుష్య కాసారాలుగా మారిన చెరువుల నీటితో కూరగాయల సాగును అడ్డుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మురుగు నీటితో సాగైన కూరగాయలు, ఆకు కూరలు ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతాయని , అవి మార్కెట్లోకి రాకుండా  చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 13 చెరువుల దుస్థితిపై అడ్వొకేట్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని సూచనల అమలుపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

కార్యాచరణ నివేదికను ఫొటోలతో సహా సమర్పించాలని పేర్కొంది. చెరువు ఆక్రమణలపై 2007లో దాఖలైన వ్యాజ్యంపై ధర్మాసనం ఏర్పాటు చేసిన కమిషన్‌ చెరువుల దుస్థితిపై ఫొటోలు, సూచనలతో సహా నివేదిక సమర్పించింది. వ్యర్థాలు, ఆక్రమణల తొలగింపు సహా నాలాలను పరిరక్షించాలని తెలిపింది. అడ్వకేట్ కమిషన్ నివేదికను చెరువుల వారీగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకికి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version