తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం మధ్యాహ్నం ఫలితాలు రిలీజ్ చేశారు. మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన ఈ పరీక్షలకు 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

తెలంగాణ ఇంటర్ పరీక్షలు రాసినవారు 9.97 లక్షల మంది విద్యార్థులు.. ఇంటర్ సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో 66.89 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతం కన్నా ఉత్తీర్ణత శాతం పెరిగింది.. ఈ సారి కూడా బాలికలదే హవా కొనసాగింది. కాగా మార్చి 05 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 9.50 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు.. 5 లక్షలకుపైగా సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.
- తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం tgbie.cgg.gov.in ను సంప్రదించాలి.