Telangana : రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు

-

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటి కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ అన్ని జిల్లాల్లో అన్ని విభాగాల వారిని సమన్వయం చేస్తూ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం అన్ని జిల్లాల కలెక్టర్లకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్చువల్‌ మీటింగ్‌ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.

పరీక్షల సమయాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి కోరారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థులు ఒత్తిడి, భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయం సాధించాలని ఇంటర్ విద్యార్థులకు సూచించారు.

ఉదయం 9 గంటలు దాటి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఓఎంఆర్‌ పత్రాన్ని విద్యార్థులు పూర్తి చేయాలని అధికారులు సూచించారు. పరీక్షలు జరిగే ప్రతిరోజు ఉదయం 8.00 నుంచి 9 గంటల వరకు ఎగ్జామ్​కు అనుమతి ఇస్తారు.  ఏప్రిల్‌ 4 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version