2022-23లో కొత్తగా 1.26 లక్షల మందికి ఉద్యోగాలు : కేటీఆర్

-

గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల్లో గణనీయ వృద్ధి నమోదైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశానికి కొత్తగా వచ్చిన ప్రతి రెండు ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణకు ఒకటి దక్కుతోందని తెలిపారు. ఐటీ ఎగుమతులు, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలో ప్రస్తుత వృద్ధి రేటు కేవలం ఆరంభం మాత్రమే అని.. భవిష్యత్తులో టీహబ్‌, ఇతర ఆవిష్కరణల్లో మరిన్ని యూనికార్న్‌లు వస్తాయని, ఇతర రంగాల్లో భారీ పెట్టుబడులతో కొత్త ఉద్యోగాలు వస్తాయని వివరించారు. ఐటీ రంగం 2022-23 వార్షిక నివేదిక విడుదల కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగించారు.

2021-22తో పోల్చితే 2022-23 సంవత్సరానికి ఐటీ ఎగుమతులు రూ.57,706 కోట్లు పెరిగి రూ.2,41,275 కోట్లుగా నమోదైందని, ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య 1,26,894 పెరగడంతో (16.2 శాతం) మొత్తం ఉద్యోగుల సంఖ్య 9,05,715కి చేరిందని తెలిపారు. ఐటీ వృద్ధిరేటులో ఆర్థిక సేవల రంగం కీలకంగా వ్యవహరించిందని, ఫార్మా రంగం నుంచి వృద్ధిరేటు పెరుగుతోందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version