144 అభ్యర్థులు.. 169 సెట్లు.. తెలంగాణలో జోరుగా నామినేషన్లు

-

తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. సోమవారం ఒక్కరోజే 144 మంది ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పదిహేడు లోక్సభ స్థానాలకు శనివారం నాటికి 156 మంది నామినేషన్లు వేయగా.. సోమవారం రోజున 144 మంది 169 సెట్ల నామపత్రాలు రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. గతంలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు సోమవారం రోజున మరో సెట్ దాఖలు చేశారు. ఆదిలాబాద్లో మూడు, పెద్దపల్లిలో 14, కరీంనగర్లో 13, నిజామాబాద్లో 12, జహీరాబాద్, మెదక్, ఖమ్మంలో ఏడు, మల్కాజిగిరి, నల్గొండ, వరంగల్లో పది, సికింద్రాబాద్లో 9, హైదరాబాద్, నాగర్ కర్నూలులో ఆరు, చేవెళ్లలో 11, మహబూబ్నగర్లో నాలుగు, భువనగిరిలో 11, మహబూబాబాద్లో నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు శ్రీగణేష్, లాస్య నందిత సహా 9 మంది నామినేషన్లు దాఖలయ్యాయి.

వచ్చే నెల 13వ తేదీన జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలో రాజకీయ హడావిడి నెలకొంది. ఈ నెల 18వ తేదీన రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాగా మంచిరోజులు చూసుకుని అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌ అభ్యర్థుల నామినేషన్‌ కార్యక్రమాలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతూ కార్నర్‌ మీటింగ్‌లు, బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థుల కోసం జాతీయ నేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు రంగంలోకి దిగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version