తెలంగాణ పోలింగ్ విధుల్లో 2.94లక్షల మంది సిబ్బంది

-

తెలంగాణ రాష్ట్రం లోక్సభ ఎన్నికలకు సిద్ధమైంది. రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రేపు (మే 13వ తేదీ 2024)న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 2.94లక్షల మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహించనున్నారు. 597 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళా సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. 119 బూత్‌ల్లో దివ్యాంగులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉంటారు.

రాష్ట్రంలో119 పోలింగ్‌ కేంద్రాల్లో విధుల్లో యువత ఉండనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,05 లక్షల ఈవోఎం యూనిట్ల వినియోగం జరగనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో 21,690 మంది హోమ్ ఓటింగ్ వినియోగించుకున్నారు. పోలింగ్‌కు భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఎన్నికల విధుల్లో 73,414 మంది సివిల్‌ పోలీసులు, 500 తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగాలు, 164 కేంద్ర బృందాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. డీజీపీ కార్యాలయంలో కేంద్రీకృత కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version