తెలంగాణ ప్రజల భావోద్వేగం వ్యవసాయం, నీరు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా జలసౌధలో కొత్తగా నియమితులైన ఏఈఈలకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇది ఉద్యోగం కాదు.. భావోద్వేగం అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో మీ అందరి భాగస్వామ్యం ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
తెలంగాణ భౌగోళిక స్వరూపం, తెలంగాణ ప్రాంత ప్రజలు ఏమి కోరుకున్నారో.. ఆ అంశాల ప్రాతిపదికన రాష్ట్రం నిర్ణయం జరిగింది. కీలక అంశం నీళ్లు.. ఆ నీటికి మీరంతా ప్రతినిధులు, రెండోది నియామకాలు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత మీకు నియామకాలు వాయిదాలు పడుతుంటే.. ఆ నియామకాలు చేపట్టాల్సిందే.. నిరుద్యోగులను ఉద్యోగులుగా మారాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.