12 మంది చిన్నారులను రక్షించారు పోలీసులు. హైదరాబాద్ – చైతన్యపురి పరిధిలో అనుమానాస్పద వ్యక్తుల చేతుల్లో ఏడుగురు అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలు ఉన్నారు. ఒక అబ్బాయి మినహా అంతా సంవత్సరంలోపు చిన్నారులే ఉన్నారు. అయితే…. విశ్వసనీయ సమాచారం ఆధారంగా చిన్నారులను రక్షించారు పోలీసులు.

చిన్నారుల తల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆచూకీ తెలిసేంతవరకు మధుర నగర్ లోని శిశు విహార సంరక్షణలో చిన్నారులు ఉంటారు. ప్రస్తుతం తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ సంరక్షణలో 12 మంది చిన్నారులు ఉన్నారు. అటు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు…. విచారణ చేస్తున్నారు.