ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల్లో అపశృతి చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ కిందపడ్డారు. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ గాయాలు అయ్యాయి. కబడ్డీ ఆడుతూ వెనక్కి పడిపోయిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కబడ్డీ ఆడుతూ వెనక్కి పడిపోయాడు.
దీంతో తలకు స్వల్పగాయం అయింది. అటు కబడ్డీ ఆడుతూ పడిపోయాడు రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. దీంతో ఆయన కాలుకు ఫ్రాక్చర్ అయింది. అలాగే క్రికెట్ ఆడుతూ కిందపడ్డారు ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి.. వీరందరినీ ఆస్పత్రికి తరలించారు అధికారులు.