తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ్టి నుంచి దాదాపు 5 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నట్లు స్పష్టం చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు పలుచోట్ల పిడుగులు పడతాయని హెచ్చరించింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. మరోవైపు ఈసారి ముందస్తుగానే ఈశాన్య రుతుపవనాల రాక మొదలు కావొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇక అటు హైదరాబాద్‌లో పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ తరుణంలోనే కొన్నిచోట్ల ట్రాఫిక్ నెలకొంది.