టీడీపీ బంద్ కు బీజేపీ మద్దతు లేదు – పురంధేశ్వరి

-

టీడీపీ బంద్ కు బీజేపీ మద్దతు అంటూ ఫేక్ లెటర్ ఒకటి వైరల్‌ గా మారింది. అయితే.. ఈ ఫేక్‌ లెటర్‌ పై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. టీడీపీ బంద్ కు మద్జతు ఇస్తున్నట్టు నా సంతకంతో ఫేక్ లెటర్ సర్కులేట్ అవుతోందని ఆగ్రహించారు. ఇవాళ్టి టీడీపీ బంద్ కు బీజేపీ మద్దతు లేదన్నారు పురంధేశ్వరి. బీజేపీ నేతలు ఎవరూ కూడా బంద్‌ లో పాల్గొనవద్దంటూ స్పష్టం చేశారు పురంధేశ్వరి.

Fake letter saying BJP supports TDP bandh

కాగా, మరోవైపు చంద్రబాబు అరెస్టు కు నిరసనగా ఇవాళ ఏపీ బంద్​కు పిలుపునిచ్చింది టీడీపీ. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు అక్రమ అరెస్టు, పార్టీ శ్రేణులపై జరిగిన దమనకాండ.. జగన్‌ కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా సోమవారం బంద్​కు పిలుపునిచ్చినట్లు తెలుగు దేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని అచ్చెన్నాయుడు కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version