హైదరాబాద్​లో తెలంగాణ రన్.. పాల్గొన్న 4వేల రన్నర్లు

-

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో తెలంగాణ 2కే రన్‌ను ఘనంగా నిర్వహించారు. ట్యాంక్‌ బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పోలీస్ు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్‌ను రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఈషా సింగ్‌, గాయకులు మంగ్లీ, రామ్‌ మిర్యాల, సినీ నటి శ్రీలీల పాల్గొన్నారు. నాలుగు వేలకుపైగా రన్నర్లు ఈ రన్‌లో పార్టిసిపేట్‌ చేశారు. సింగర్స్‌ మంగ్లీ, రామ్‌లు తమ పాటలతో రన్నర్లలో హుషారు నింపారు. మరోవైపు మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో 2కే రన్‌లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్‌లో 2కే రన్‌లో సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version