బీఆర్ఎస్ అభ్యర్థి అరికపుడి గాంధీకి తెలంగాణ టీడీపీ మద్దతు

-

బీఆర్ఎస్ అభ్యర్థి అరికపుడి గాంధీకి తెలంగాణ టీడీపీ మద్దతు తెలిపింది. అభివృద్ధి, లోకల్ గా ఉన్న పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని, గాంధీ గెలుపు కోసం కృషి చేస్తామని కొండాపూర్, గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్, హఫీజ్ పేట్, ఆల్విన్ కాలనీ, డివిజన్ల అధ్యక్షులు తెలిపారు. ఇప్పుడున్న అభ్యర్థుల్లో ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా అందరిని ఆదరించే నాయకుడు గాంధీకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.

Telangana TDP supports BRS candidate Arikapudi Gandhi

ఇక దీనిపై బీఆర్ఎస్ అభ్యర్థి అరికపుడి గాంధీ మాట్లాడుతూ…పార్టీ మారి, తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసానన్న రేవంత్ రెడ్డిగారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. నాలుగు పార్టీలు మారిన ఆయన నన్ను విమర్శించడం హాస్యాస్పదం. నేను ఏ పరిస్థితుల్లో పార్టీ మారానో చంద్రబాబు నాయుడు గారికి, ప్రజలకూ తెలుసు అన్నారు. అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సర్వనాశనం కావడానికి కారణం రేవంత్ రెడ్డి కాదా? ఆయన నామీద చేసింది కేవలం ఆరోపణలు మాత్రమేనని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version