తెలంగాణలో 6,612 టీచర్‌ పోస్టులు.. రెండ్రోజుల్లో నియామక విధివిధానాలు

-

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపికబురును అందించింది. ఎట్టకేలకు ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సర్కార్‌ పచ్చజెండా ఊపింది. టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) ద్వారా 5,089 సాధారణ ఉపాధ్యాయ ఖాళీలతోపాటు ప్రత్యేక అవసరాల పిల్లలకు సంబంధించి 1,523 టీచర్ల ఖాళీలు… మొత్తం 6,612 పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. గతంలో మాదిరిగా జిల్లా ఎంపిక కమిటీలు(డీఎస్సీ) నియామకాలు చేపడతాయని వెల్లడించారు. ఈ ప్రకారం టెట్‌లో క్వాలిఫై అయిన వారంతా టీఆర్‌టీకి పోటీ పడేందుకు అర్హులు.

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) సెప్టెంబరు 15న నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అదే నెల 27న ఫలితాల వెల్లడి ఉంటుందని.. ఆ తర్వాత వెంటనే నోటిఫికేషన్‌ జారీ అవుతుందని చెప్పారు.  రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,22,386 ఉండగా… ప్రస్తుతం 1,03,343 మంది పనిచేస్తున్నారని వెల్లడించారు.

ప్రత్యక్ష నియామకాల ద్వారా 6,612 కాకుండా పదోన్నతుల ద్వారా 1,947 గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, 2,162 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు(పీఎస్‌హెచ్‌ఎం), 5,870 స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీలను(మొత్తం 9,979) భర్తీ చేస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version