తెలంగాణలో టీచర్లకు షాక్.. పదోన్నతులకు హైకోర్టు బ్రేక్

-

రాష్ట్రంలో ఉపాధ్యాయులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇక రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులు ఇక ఆగిపోయినట్లే!. ప్రమోషన్ పొందాలన్నా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) తప్పనిసరి అని కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించడంతో టెట్‌ ఉత్తీర్ణులై, పదోన్నతి పొందేందుకు అర్హులైన వారి సీనియారిటీ జాబితా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్కూల్‌ అసిస్టెంట్లుగా, గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా పదోన్నతులకు బ్రేక్‌ పడినట్లేనని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పదోన్నతులపై ముందుకెళ్లడం సాధ్యం కాదని విద్యాశాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఉపాధ్యాయులుగా నియమితులు కావడంతో పాటు, పదోన్నతులకూ టెట్‌ ఉత్తీర్ణతను తప్పనిసరిచేస్తూ కేంద్రం 2010లో చట్టం చేసింది. ఆ ప్రకారం ఎన్‌సీటీఈ ఆ ఏడాదే నిబంధనలు విడుదల చేసింది. తాజా పదోన్నతుల్లో ఆ నిబంధనలను పాటించాలంటూ కొందరు ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో.. టెట్‌ పాసై ప్రస్తుతం ఉపాధ్యాయులుగా ఉన్నవారి సీనియారిటీ జాబితాను సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానిపై కౌంటర్‌ దాఖలు చేస్తామని ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదించింది. ఈక్రమంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు కష్టమని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version