మద్యం బాబులు రోజు రోజుకు ఎక్కువవుతున్నారు. మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని తెలిసినప్పటికీ ఎవరు భయపడడం లేదు. కొంతమంది ప్రతిరోజూ మద్యం తాగకుండా అస్సలు ఉండలేరు. మరి కొంతమంది వారంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే మద్యం సేవిస్తారు. ఇక తెలంగాణలో మద్యం బాబులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నారు.

మద్యం వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంతాలలో ఒక వ్యక్తి సగటున సంవత్సరానికి విదేశీ మద్యం బీరు కోసం రూ. 3,061 ఖర్చు చేస్తున్నట్లుగా NIPFP స్టడీలో తెలిసింది. జాతీయ సగటు రూ. 486 ఉండడం గమ నార్హం. అలాగే రాష్ట్రం లోని అర్బన్ ప్రాంతాలలో సిగరెట్ల కోసం యావరేజ్ గా సంవత్సరానికి రూ. 624 ఖర్చు చేస్తున్నారు. మరోవైపు వార్షిక వ్యక్తిగత వినియోగ ఖర్చులో సిక్కిం అగ్రస్థానంలో నిలిచింది. అంటే తెలంగాణలో మద్యం అధికంగా సేవిస్తున్నారని నివేదికలో వెళ్లడైంది.