తెలంగాణ పర్యాటక సంస్థ ఎండీపై సస్పెన్షన్‌ వేటు

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న వేళ ఎన్నికల సంఘం అభ్యర్థులపై పటిష్ఠ నిఘా పెట్టింది. అభ్యర్థులు ఎన్నికల నియమాలు ఉల్లంఘించకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎవరైనా ఉల్లంఘించినట్లు తెలిస్తే వెంటనే చర్యలకు ఉపక్రమిస్తోంది. మరోవైపు ఎన్నికల బాధ్యతలు సక్రమంగా నిర్వహించాల్సిన అధికారులపైనా కొరఢా ఝళిపిస్తోంది. తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బోయినపల్లి మనోహర్‌ రావుపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయణ్ను సస్పెండ్‌ చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

మనోహర్ వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న విశ్రాంత డిప్యూటీ కలెక్టర్‌ వై.సత్యనారాయణనూ ఉద్యోగం నుంచి తొలగించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్​కు లేఖ రాసింది. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి మనోహర్‌రావు, సత్యనారాయణ గత నెల 15, 16వ తేదీల్లో తిరుమల వెళ్లినట్లు ఈసీకి ఫిర్యాదు రావడంతో రాష్ట్ర ఎన్నికల అధికారులు విచారణ జరిపి నివేదికను సీఈసీకి పంపారు. దీన్ని అధ్యయనం చేసిన సీఈసీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పేర్కొంటూ వారిపై చర్యలకు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version