సివిల్స్‌-2022లో తెలుగోళ్ల సత్తా

-

ప్రతిష్టాత్మకమైన సివిల్స్ పరీక్షల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. 2022 సంవత్సరంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది మొత్తం 933 మంది అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యారు. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు కూడా తమ సత్తాచాటారు.

తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 మంది ర్యాంకులు దక్కించుకున్నారు. వందలోపు ర్యాంకులు 8 మంది కైవసం చేసుకున్నారు. నారాయణ పేట ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె ఉమా హారతి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి.. తెలుగు రాష్ట్రాల్లో టాపర్‌గా నిలిచారు. తిరుపతికి చెందిన జీవీఎస్ పవన్ దత్తా 22వ ర్యాంకు కైవసం చేసుకున్నారు.

రాజమండ్రికి చెందిన తరుణ్ పట్నాయక్ మాదాలకు 33, హైదరాబాద్‌కు చెందిన అజ్మీరా సంకేత్ కుమార్ 35, వరంగల్‌ జిల్లాకు చెందిన శ్రీసాయి ఆశ్రిత్ శాఖమూరికి 40వ ర్యాంకు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్ సాయి ప్రణవ్‌ 60, ఉత్కర్ష్ కుమార్ 78, ఆవుల సాయికృష్ణ 94వ ర్యాంకు సాధించారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అభ్యర్థులు తమ ప్రతిభతో మెరిశారు. ఏపీ, తెలంగాణ నుంచి నిధి పాయ్, అంకుర్ కుమార్, శ్రీకృష్ణ, హర్షిత, లక్ష్మీ సుజిత, కమల్ చౌదరి, రేవయ్య, శ్రవణ్ కుమార్ రెడ్డి, రెడ్డి భార్గవ్, నాగుల కృపాకర్ సివిల్స్‌కు ఎంపికయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version