మండిపోతున్న వీణవంక.. రాష్ట్రంలో గరిష్ఠంగా ఇక్కడ 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత

-

రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్‌, జగిత్యాల, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. శనివారం రోజున ఈ జిల్లాల్లో ఈ ఏడాదిలో ఇప్పటివరకూ లేనిస్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వేడి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కరీంనగర్‌ జిల్లాలో కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తుండగా.. శనివారం రాష్ట్రంలోనే గరిష్ఠంగా ఇక్కడి వీణవంక మండలంలో 45.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

జగిత్యాల జిల్లాలో ధర్మపురి మండలంలోని జైన, బుద్దేశ్‌పల్లి, సారంగాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలం గోధూరు, మల్లాపూర్‌ మండలం రాఘవపేట, వెల్గటూరు మండల కేంద్రంలో 44.6 నుంచి 45.4 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో ముదిగొండ, చింతకాని, నేలకొండపల్లి ప్రాంతాల్లో.. పెద్దపల్లి జిల్లా రంగంపల్లి, సుల్తానాబాద్‌, పాల్తెం.. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి, ముప్కాల్‌ మండలాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. హైదరాబాద్‌ నగరంలో గరిష్ఠంగా ఖైరతాబాద్‌లో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version