BREAKING : నల్లగొండలోని భాస్కర్ టాకీస్ వద్ద ఉద్రిక్తత..బీహార్, స్థానిక కూలీల మధ్య ఘర్షణ

-

BREAKING : నల్లగొండలోని భాస్కర్ టాకీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా కేంద్రంలో బీహార్ కూలీలు, స్థానిక కూలీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పట్టణంలోని భాస్కర్ థియేటర్ వద్ద కూలీల కొట్లాట తో రణరంగంగా మారింది. గత కొద్దిరోజులుగా అడ్డ మీద కూలి విషయంలో బీహార్ కూలీలకు, స్థానిక కూలీలకు మధ్య వివాదం కొనసాగుతుంది.

బీహార్ కూలీలు కూలీ పనికి 200 రూపాయలకే వస్తుండగా… స్థానిక కూలీలు 400 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు.. కూలి విషయంలో ఈ వివాదం ముదరడంతో ఈరోజు బీహార్ కూలీలు స్థానిక కూలీలపై రాళ్లు రువ్వారు. ఒకసారిగా పదుల సంఖ్యలో బీహార్ కూలీలు స్థానిక కూలీలపై రాళ్లు రావడంతో వాతావరణ ఒక్కసారిగా రణరంగంగా మారింది. ఈ రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాళ్లూరువిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version