చెంగిచెర్ల మండీ మార్కెట్ సమీపంలోని పిట్టల బస్తీలో హోలీ సంబరాలు చేసుకుంటున్న హిందులపై ముస్లింల దాడికి నిరసనగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో భాగంగా వీహెచ్పీ సభ్యులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ అక్కడే ఉన్న మసీదు వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిపై లారీ చార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని చెదరగోడుతూ.. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని చెంగిచెర్ల ఏరియాలో ఉన్న పిట్టల బస్తీలోని హిందువులు హోలీ పండుగ సందర్భంగా డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకున్నారు. ‘అదే ఆవరణలో మసీదు ఉండగా.. రంజాన్ వేళ సమాజ్ చేసే సమయం అయ్యిందని పాటలు ఆపాలని వారికి సూచించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొనగా.. ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు మరో వర్గం మహిళలపై దాడి చేశారు. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా, దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదని విశ్వ హిందు పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.