రేప్ టెట్‌ పరీక్ష.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

-

రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష-టెట్‌కు అధికారులు రంగం సిద్ధం చేశారు. శుక్రవారం రోజున ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు పేపర్-వన్… మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ టూ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 78 వేల 55 మంది అభ్యర్థుల కోసం 2 వేల 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు టెట్‌ కన్వీనర్ రాధా రాణి తెలిపారు.

టెట్‌ జరగనున్న విద్యా సంస్థలకు…. ప్రభుత్వం ఇవాళ మధ్యాహ్నం, రేపు పూర్తిగా సెలవు ప్రకటించింది. పరీక్ష కోసం 2 వేల 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 22 వేల 572 మంది ఇన్విజిలేటర్లు,.. 10 వేల 260 మంది హాల్ సూపరింటెండెట్లను నియమించినట్లు కన్వీనర్ తెలిపారు. సీసీ కెమెరాలు, ఫర్నీచర్, నిరంతర విద్యుత్ సరఫరా, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఆర్టీసీ బస్సుల సదుపాయం, బందోబస్తు తదితర ఏర్పాట్లు చేయాలని.. కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులు, పోలీసులను కోరినట్లు పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీన టెట్ ఫలితాలను వెల్లడించనున్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించారు. విద్యార్థులంతా ధైర్యంగా పరీక్ష రాయాలని రాధారాణి సూచించారు. పరీక్షకు గంట ముందే కేంద్రాల వద్దకు చేరుకోవాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version