పదోన్నతికి టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

-

రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోన్నతిపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీచర్లు పదోన్నతి పొందాలంటే టెట్‌ ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యాహక్కు చట్టం, జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులుగా నియమితులైన వారు పదోన్నతి పొందాలంటే టెట్‌లో పాస్‌ కావాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డికి వివరించినట్లు తెలిసింది. ఈక్రమంలో టెట్‌ నిర్వహణపై విద్యాశాఖ దృష్టి సారించింది.

ఈ నిర్ణయం వేలాది మంది సీనియర్‌ ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది. కొత్త నియామకాల్లో ఆ నిబంధనను అమలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ పదోన్నతులకు మాత్రం అమలు చేయకపోవడంతో టెట్‌ పాసైన వారికే పదోన్నతులివ్వాలని పలువురు ఉపాధ్యాయులు కొద్ది నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. పదోన్నతి కోసం టెట్‌ పాసైన వా సీనియారిటీ జాబితా సమర్పించాలని గత సెప్టెంబరు 27వ తేదీన హైకోర్టు మధ్యంతర తీర్పు ఇవ్వడంతో ప్రమోషన్లకు బ్రేక్‌ పడింది. రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు లక్షా 22వేల386ఉంటే సుమారు 26 వేల మంది టెట్‌ పాసైన టీచర్లు ఉన్నారు. ఇంకా 96 వేల మందికి టెట్‌ అర్హతలేదు. వారివి షయంలో ఎలా వ్యవహరిస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version