బీజేపీ గెలిచే చోట.. ఓడించ గలిగే అభ్యర్థికి ఓటు వేయండి అని చెప్ప దలుచుకున్నామని ప్రకటన చేశారు సీపీఎం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీర భద్రం. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరుణంలోనే కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసుకున్న సీపీఎం పార్టీ..తన తొలి జాబితా విడుదల చేసింది. కాసేపటి క్రితమే సిపిఎం తొలి జాబితా విడుదల చేసింది.
14 మంది అభ్యర్థులతో జాబితాలో చోటు కల్పిస్తూ…సిపిఎం తొలి జాబితా విడుదల చేసింది. ఈ సందర్భంగా సీపీఎం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీర భద్రం మాట్లాడుతూ..మూడు నినాదాలతో ఎన్నికలకు వెళుతున్నామని.. మొదటిది.. సీపీఎంకి అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఇవ్వండని కోరారు. కమ్యూనిస్టుల వల్లనే.. సమాచార హక్కు.. ఉపాధి హామీ వచ్చిందని తెలిపారు. రెండోది.. వామపక్ష పార్టీలను బలపరచండి అని పిలుపునిస్తామని వివరించారు. మూడో నినాదం.. బీజేపీ దుర్మార్గ పాలన కు స్వస్తి పలకండి… బీజేపీ గెలిచే చోట.. ఓడించ గలిగే అభ్యర్థికి ఓటు వేయండి అని చెప్పదలుచుకున్నామన్నారు తమ్మినేని.