ఈ నెల 21న లగచర్లకు వాపపక్ష పార్టీలు వెళతాయన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. చిట్ చాట్ లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ… రేవంత్ సర్కార్ ఏడాది పాలన ఆశా భంగం కలిగించిందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు 7 వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నారన్నారు. కానీ అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యం కనుమరుగైందని ఆగ్రహించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.
ఈ నెల 21 న అన్ని వామపక్ష పార్టీలు తలపెట్టిన లగచర్ల పర్యటనను అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రాబోయే రోజుల్లో వామపక్ష పార్టీల ప్రజాసంఘాలన్నీ ఒకే వేదిక కిందకు రాబోతున్నాయన్నారు. భవిష్యత్తులో చేసే ప్రతి పోరాటాన్ని ఈ వేదిక ద్వారానే నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 26 న అన్ని వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించబోతున్నామన్నారు. ఉమ్మడి వామపక్ష పార్టీల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.