ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండలో దారుణం చోటుచేసుకుంది. 700 ఏళ్ల చరిత్ర కలిగిన పాత శివాలయంలోని గర్భగుడిలో పూజారి మద్యం సేవిస్తున్నట్లు ఓ వీడియో హల్చల్ చేస్తోంది. పూజారి ప్రసాద్ గుడిని అపవిత్రం చేశాడంటూ భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వీడియో ఒక్కసారిగా వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించి పూజారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసిన పూజారి ప్రసాద్‌ను కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో వెంటనే ఆలయానికి చేరుకున్న పోలీసులు పూజారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ వీడియోపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.