Telangana: తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య పొత్తు రద్దు !

-

Telangana: తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య పొత్తు రద్దు అయ్యేలా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి వలసలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక త్వరలో మరో నలుగురైదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. గులాబీ పార్టీ నుంచి చేరిన వారిలో ఆర్థికంగా బలంగా ఉన్న వారిని లోక్‌సభ బరిలో నిలపాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది.

ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో ఉన్న కాంగ్రెస్, సీపీఐ పార్టీల దోస్తాన్ పార్లమెంట్ ఎన్నికల్లో కొలిక్కి రావడం లేదని సమాచారం అందుతోంది. పొత్తులో భాగంగా వరంగల్ లేదా కరీంనగర్ ఏదైనా ఒక సీట్ కేటాయించామని కోరుతోందట సీపీఐ. వరంగల్, కరీంనగర్ నుంచి కాంగ్రెస్ తరుపున ఆశావహులు ఉండటం వలన సీపీఐకి సీట్ ఇవ్వడం కుదరదు అంటోందట కాంగ్రెస్. సీట్ కేటాయించకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా అన్ని స్థానాల్లో బరిలో దిగుతామంటోందట సీపీఐ. దీంతో తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య పొత్తు రద్దు అయ్యేలా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version