ముడు నెలలో దాదాపు 3 కోట్ల ఫైన్స్ వేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..!

-

గడిచిన ముడు నెలలకు సంబంధించిన డ్రంకెన్ డ్రైవ్ వివరాలు వెల్లడించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల. గడిచిన 3 నెలలు ఆగస్టు 24 నుంచి నవంబర్ 21 వరకు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 13,933 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి.. వివిధ కోర్టుల్లో 13,188 చార్జిషీట్లు దాఖలు చేసారు పోలిసులు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 52,080 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేసారుట్రాఫిక్ పోలిసులు.

ఇక గత 3 నెలల్లో 824 మంది మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి 1 నుంచి 10 రోజుల వరకు జైలు శిక్ష, 2 రోజుల పాటు 227 మంది మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి సామాజిక సేవ చేయాలని ఆదేశించింది గౌరవ మేజిస్ట్రేట్‌. RTO ద్వారా 99 డ్రైవింగ్ లైసెన్స్‌లను 2 నుండి 6 నెలల పాటు సస్పెండ్ చేసారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారందరిపై 2,87,20,600 జరిమానా విధించారు. గత 3 నెలల్లో పట్టుబడిన డ్రైవర్లలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు 11,904 మంది ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version