తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు మనోజ్ రాకూడదంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి తరుణంలోనే యూనివర్సిటీ క్యాంపస్ లోనే ఉన్నారు మోహన్ బాబు. మోహన్ బాబు యూనివర్సిటీ ఇవాళ రానున్నారు మంచు మనోజ్. పోలీసులకు కోర్టు ఉత్తర్వులు గురించి సమాచారం ఇచ్చారు మోహన్ బాబు.
మోహన్ బాబు సమాచారం మేరకు వర్శిటి భారీ భద్రత ఏర్పాటు చేశారు ఏపీ పోలీసులు. మరి కాసేపట్లో వర్శిటి వద్దకు రానున్నారు మనోజ్. దీంతో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక అటు కాలూరు క్రాస్ వద్ద మంచు మనోజ్ బైక్ ర్యాలీ ప్రారంభమైంది. మరి కాసేప ట్లో మోహన్ బాబు యూనివర్సిటీకి వెళతారు మనోజ్.