హైదరాబాద్ మహా నగరంలో దారుణం చోటు చేసుకుంది. కుంభమేళా వెళ్లే భక్తులను నడి రోడ్డు మీద వదిలేశాడు ఓ డ్రైవర్. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెహిదీపట్నం వద్ద బస్ ట్రబుల్ ఇవ్వడంతో.. మరో బస్సు సిద్ధం చేశారు. అందులో వసతులు సరిగ్గా లేవని.. ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో.. మేడ్చల్ చేరుకున్నాక బస్సు ఆపి, పారిపోయాడు డ్రైవర్.
మధ్యాహ్నం 3 గం. నుంచి.. రోడ్డు మీదే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. అటు నడిరోడ్డుపై వదిలేయడంతో… ప్రయాణికులు సీరియస్ అయ్యారు.. న్యూ ధనుంజయ ట్రావెల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ బస్సు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ డ్రైవరన్నా.. ఇంత పని చేశావేంటి..? అంటూ ఈ సంఘటనపై జనాలు స్పందిస్తున్నారు.
ఓ డ్రైవరన్నా.. ఇంత పని చేశావేంటి..?
కుంభమేళా వెళ్లే భక్తులను నడి రోడ్డు మీద వదిలేసిన డ్రైవర్
మెహిదీపట్నం వద్ద బస్ ట్రబుల్ ఇవ్వడంతో.. మరో బస్సు సిద్ధం
అందులో వసతులు సరిగ్గా లేవని.. ప్రయాణికుల ఆందోళన
దీంతో.. మేడ్చల్ చేరుకున్నాక బస్సు ఆపి, పారిపోయిన డ్రైవర్
మధ్యాహ్నం 3 గం.… pic.twitter.com/zKfWvsP4Xn
— Pulse News (@PulseNewsTelugu) February 1, 2025