నిరుద్యోగులను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది – బల్మూరి వెంకట్

-

ఉద్యోగుల ఖాళీలు భర్తీ చేస్తున్నామని చెబుతూ నిరుద్యోగులను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్. గురుకుల నోటిఫికేషన్ కి 2 లక్షల 60 వేల మంది అప్లై చేసుకున్నారని తెలిపారు. పీజీటీ, టీజీటీ, జేఎల్, డిఎల్ ఎగ్జామ్స్ ఉన్నాయని.. పీజీటీ, టీజీటీ లకు 3 ఎగ్జామ్స్ ఉంటాయి.. ఒకే సెంటర్ ఉండేది.. కానీ 3 ఎగ్జామ్స్ కి వేరు వేరు సెంటర్లు ఇచ్చారని అన్నారు. గురుకుల నోటిఫికేషన్ కి సంబందించి ఎగ్జామ్స్ రాయడానికి కన్వీనెంట్ గా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు.

ఒకే సెంటర్లో 3 ఎగ్జామ్స్ ఉండేలా చూడాలని.. లేదంటే పరీక్షకి పరీక్షకి మధ్య గ్యాప్ ఇవ్వాలని కోరారు. గురుకుల ఎగ్జామ్స్ 21 -23 కి గ్రూప్ 2 ఒకేసారి పెట్టడం వల్ల ఇబ్బందులు ఉంటాయన్నారు. తక్షణమే గ్రూప్ 2 వాయిదా వేయాలని కోరుతున్నామన్నారు. గ్రూప్ 2 వాయిదా కోరుతున్న వారిపై కేసులు పెడుతూ బెదిరిస్తున్నారని ఆరోపించారు బల్మూరి వెంకట్. ఆగస్టు 5 లోపు గ్రూప్ 2 వాయిదా వేయాలని శాంతియుతంగా లేఖలు రాద్దామని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version