తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త. తెలంగాణలో రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ అందించేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తొలిదశలో నారాయణ పేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2096 పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలకూ అమలు చేయనుందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా… రేపు దీనిని ప్రారంభించనున్నారు.. ఈ కనెక్షన్ తీసుకుంటే 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్, వర్చువల్ నెట్వర్క్, టెలిఫోన్, పలు OTTలు చూడవచ్చు అని చెబుతున్నారు. త్వరలోనే అన్ని గ్రామాలకు దీనిని విస్తరించనున్నారట. అయితే… తెలంగాణలో రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యం లో.. ప్రజలు, యూత్ ఆసక్తిగా చూస్తున్నారు. నిజంగా అందుబాటులోకి వస్తే.. బాగుంటుందని చెబుతున్నారు.