తిరుపతిలో యువకుల పైశాచికత్వం..కుక్కను కత్తితో పొడిచి చంపి..!

-

తిరుపతిలో యువకులు పైశాచికత్వానికి పాల్పడ్డారు. నగరంలో ఇద్దరు యువకులు… ఓ కుక్కను కత్తితో పొడిచి చంపారు. ఆ ఇద్దరు యువకులు…ఇంటి ముందు రాళ్ళు విసురుతూంటే కుక్క అరిచింది. ఈ తరుణంలోనే… కోపంతో కుక్కను కత్తితో పొడిచిన చంపారు ఇద్దరు యువకులు. తిరుపతిలోని లీలామహల్ సమీపంలో చేపల మార్కెట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే.. పోలీసులకు ఫిర్యాదు చేసారు కుక్క యజమాని లావణ్య.

తిరుపతిలో యువకుల పైశాచికత్వం..కుక్కను కత్తితో పొడిచి చంపి..!

ఈ సంఘటనపై కుక్క యజమాని లావణ్య మాట్లాడారు. ఇంటి వద్ద ఉన్న కుక్క ఇద్దరు యువకులు కత్తి పోడిచి చంపారు…పోలిసులకు ఫిర్యాదు చేస్తే కుక్క తండ్రి ఎవరు‌‌.‌.కుక్క చంపడం పై కేసు ఎంటి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆగ్రహించారు. చిన్నపిల్లల ఎదురుగానే చంపారని చెబుతున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. రేపు మాపైన దాడి చేస్తే మా పరిస్థితి ఎంటి అని ఆవేదన వ్యక్తం చేశారు లావణ్య. నాలుగేళ్ళ పాటు పెంచుకున్మ చనిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు యజమాని లావణ్య. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version